సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రీకన్ అడవుల నేపథ్యంలో అడ్వైంచర్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బిజీగా ఉన్నాడు. గుంటూరు కారం సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే తన లుక్, మేకోవర్ పూర్తిగా మార్చేశారు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‌తో జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా.
ఇదిలా ఉంటే పై ఫొటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా.? మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది ఆమె.. కానీ అనుకోని ప్రమాదం కారణంగా కన్నుమూసి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె ఎవరో కాదు సీనియర్ నటి అలనాటి నటి సుకుమారి అమ్మ. ఈ సీనియర్ హీరోయిన్ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. స్టార్ హీరోలతో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఎక్కువగా మలయాళ, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమారి. ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఇక మహేష్ బాబుతో మురారి సినిమాలో నటించారు సుకుమారి. మురారి సినిమాలో మహేష్ బాబు బామ్మ గా కనిపిచారు. సినిమాలో ఎక్కువ భాగం ఆమె పైనే ఉంటుంది. కాగా సుకుమారి మరణం సినీ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. చెన్నైలోని తన నివాసంలో అగ్నిప్రమాదానికి గురయ్యారు. ఇంట్లో పూజగదిలో దీపం వెలిగిస్తూ ఉండగా అనుకోకుండా మంటలు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స తీసుకుంటుండగా గుండెపోటు రావడంతో ఆమె కన్నుమూశారు. 2013 మార్చి 26న ఆమె కన్నుమూశారు. ఆమె మరణంపై సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.