పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ వేళ పసిడి ధరలు ఈ స్థాయికి చేరడంతో వినియోగదారులు భయపడుతున్నారు.. ఈ తరుణంలో పసిడి ప్రియులకు శుభవార్త వచ్చింది.. బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే దాదాపు రూ.3 వేల మేర బంగారం ధర తగ్గింది.. లైవ్ మార్కెట్‌లో రూ.99,000 అటూఇటూగా బంగారం ట్రేడవుతోంది..
దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిని తాకిన విషయం తెలిసిందే.. రెండు రోజులుగా పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరడంతో, బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర లక్ష మార్కును దాటింది. పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ వేళ పసిడి ధరలు ఈ స్థాయికి చేరడంతో వినియోగదారులు భయపడుతున్నారు.. ఈ తరుణంలో పసిడి ప్రియులకు శుభవార్త వచ్చింది.. బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే దాదాపు రూ.3 వేల మేర బంగారం ధర తగ్గింది.. లైవ్ మార్కెట్‌లో రూ.99,000 అటూఇటూగా బంగారం ట్రేడవుతోంది..
హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు ఇలా..
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2750 తగ్గుదలతో రూ. 90,150గా ఉంది..
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 3000 రూపాయల తగ్గుదలతో రూ. 98,350గా ఉంది.
వెండి ధర కిలోకు రూ. 1,11,000గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 98,350గా ఉంది. వెండి ధర కిలోకు రూ. 1,11,000గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.98,500గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,300 లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.98,350గా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.90,150గా ఉంది.
కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 98,350, 22 క్యారెట్ల ధర 90,150 రూపాయలుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.98,350గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,150గా ఉంది.
వెండి కిలో ధర దేశీయంగా.. 1,01,000లుగా కొనసాగుతోంది..
కాగా.. ఈ ధరలు ప్రాంతాల వారీగా మారుతుంటాయి.. గమనించగలరు.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.