మొన్న భర్త.. ఇప్పుడు భార్య.. బిగ్ బాస్ ఆఫర్ పై అమర్ దీప్ భార్య ఏమన్నదంటే..

మొన్న భర్త.. ఇప్పుడు భార్య.. బిగ్ బాస్ ఆఫర్ పై అమర్ దీప్ భార్య ఏమన్నదంటే..

బుల్లితెరపై సీరియల్ హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అమర్ దీప్. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు అమర్ దీప్. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి విన్నర్ మెటిరియల్ గా వెళ్లడం.. చివరకు రన్నరప్ అయినప్పటికీ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి హీరోగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు అమర్ దీప్. పలు సీరియల్స్, టీవీ షోలతో ఫేమస్ అయిన అమర్ దీప్ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టాడు. విన్నర్ మెటిరియల్ గా షోలోకి ఎంట్రీ ఇచ్చిన అమర్ దీప్.. తన ఆట తీరుతో మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ షోలో రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో తర్వాత పలు షోలలో పాల్గొంటున్నాడు. అలాగే అతడి భార్య తేజస్విని గౌడ సైతం సుపరిచితమే. పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. వీరిద్దరి కొన్నాళ్లు ప్రేమలో ఉండి 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్దిరోజులుగా వీరిద్దరి పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

అలాగే తేజస్విని గౌడ ఈసారి బిగ్ బాస్ రియాల్టీ షోలోకి వెళ్లే ఛాన్స్ అందుకుందని.. త్వరలో రాబోయే సీజన్ కు వెళ్లనుందనే టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని బిగ్ బాస్ షోకు వెళ్లడం పై క్లారిటీ ఇచ్చింది. తనకు లాస్ట్ టైం కూడా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందని.. మీటింగ్ కు కూడా వెళ్లి వచ్చానని తెలిపింది. అంతకు ముందు వెళ్దాం అనుకున్నప్పటికీ అమర్ దీప్ బిగ్ బాస్ షోకు వెళ్లొచ్చిన తర్వాత తనకు అంతగా ఇంట్రెస్ట్ లేదని తెలిపింది.

అమర్ వెళ్లినప్పుడు కూడా తనను అడిగారని.. అప్పుడు తనకు సీరియల్స్ ఉండడంతో కుదరలేదని.. గతేడాది కొన్ని అనివార్య కారణాల వెళ్లలేదని.. ఇకపై వెళ్లను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తమ విడాకుల గురించి వస్తున్న వార్తలపై తేజస్విని రియకాట్ అయ్యింది. తమ గురించి వస్తున్న న్యూస్ ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలియదని.. వాటిని విని వదిలేస్తున్నామని తెలిపింది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు