దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం పడ్నవీష్, గోవా సీఎం ప్రమోద సావంత్ హాజరైన సమ్మేళనం మూడు రోజుల పాటు జరగనుంది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాగా ఆలయాలపై చర్చలు, ప్రదర్శనలు, వర్క్ షాపులు జరుగుతున్నాయి. దాదాపు 57 దేశాల్లోని 1600 దేవాలయాలను ఒకే వేదికకు అనుసంధానం చేస్తూ ఏర్పాట్లు చేశారు.
తిరుపతి అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనానికి వేదికైంది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం పడ్నవీష్, గోవా సీఎం ప్రమోద సావంత్ హాజరైన సమ్మేళనం మూడు రోజుల పాటు జరగనుంది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాగా ఆలయాలపై చర్చలు, ప్రదర్శనలు, వర్క్ షాపులు జరుగుతున్నాయి. దాదాపు 57 దేశాల్లోని 1600 దేవాలయాలను ఒకే వేదికకు అనుసంధానం చేస్తూ ఏర్పాట్లు చేశారు.
టెంపుల్ సిటీ లో జరుగుతున్న అతి పెద్ద ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ లో పలు అంశాలపై చర్చ జరగనుంది. ఆలయాల స్థిరత్వం, పునరుత్పాదక శక్తి, ఆలయ పాలన, ఆలయాల ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ టెంపుల్ సొల్యూషన్స్ వంటి అంశాలపై చర్చా గోష్టి జరగనుంది. వందకు పైగా ఆలయాలకు చెందిన ప్రతినిధులు, ట్రస్టీలు, వర్చువల్ గా మరో 1600 కు పైనా పాల్గొనేలా ఏర్పాట్లు జరిగాయి. కన్వెన్షన్ ఎక్స్ పో లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ఆలయాల ప్రతినిధులు, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వీఐపీల భద్రత కు పెద్ద పీట వేసిన అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు నిర్వహిస్తోంది. ఇక మూడు రోజుల పాటు జరిగే కన్వేషన్ పలు కీలక నిర్ణయాలను తీసుకోనుంది. ఆలయాల పరిరక్షణ, పాలన వ్యవహారాలు, ఆలయ ఆర్థిక వ్యవస్థ, అమలు చేస్తున్న విధానాలపై వర్క్ షాప్ లో ప్రధాన చర్చ జరగనుంది.
సరైన సమయంలో సరైన ప్రధాని మోదీ : సీఏం చంద్రబాబు
తిరుపతి జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ను ప్రారంభించిన ఏపీ సీఏం చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. 55 కోట్లమంది కుంభమేళలో పవిత్రమైన స్నానాలు ఆచరించారన్నారు చంద్రబాబు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు అభివృద్ధికి సూచికలన్నారు. ఈ ఎక్స్ పో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు. టెక్నాలజీ వినియోగంలో మనం మరింత ముందు కెళ్లాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఒక ఏ ఐ నిపుణుడు తయారు అవుతున్నాడని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారన్నారు. కోట్లమంది భక్తులు విరాళాలు ఇస్తున్నారన్నారు. విద్య, వైద్యం సహా ఇతర సేవ కార్యక్రమాల కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి, టెంపుల్ సర్క్యూట్ లను ఏర్పాటు చేస్తున్నా మన్నారు. అర్చకులకు వేతనాలను పెంచామన్నారు. ఆలయాలలో దూప, దీప, నైవేద్యాలకు ఇచ్చే నగదును పెంచామన్నారు. దేశానికి సరైనా సమయంలో సరైనా ప్రధానిగా మోదీ ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్..
ఇక ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సనాతన ధర్మాన్ని, సంస్కృతి కాపాడటానికి మోదీ ఒక యజ్ఞం చేస్తున్నారని ప్రశంసించారు. 50 కోట్లమంది పైగా మహా కుంభమేళలో పవిత్ర పుణ్యస్నానం ఆచరించారన్నారని చెప్పారు. ప్రయోగ్ రాజ్ లో మహా కుంభమేళ సాగుతుంటే టెంపుల్ సిటీ తిరుపతిలో ఆలయాల పరిరక్షణ కుంభమేళ సాగుతోందన్నారు. దక్షిణ భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే క్రేన్ లు, భారీ యంత్రాలు లేకపోయినా పెద్ద పెద్ద ఆలయాలను దేశంలో నిర్మించారన్నారు. ఆలయాలు పూజ మందిరాలు కాదని సామాజిక పరివర్తన కేంద్రాలు కూడా అన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.
సనాతన ధర్మం ఆచరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం- గోవా సీఎం ప్రమోద్ సావంత్.
ఇక ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ లో ముఖ్య అతిథిగా గోవా సిఎం ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. సంస్కృతి, భాష, వేషం వేరైనా మనందరం ఒక్కటేన్నారు గోవా సీఎం. మన సంస్కృతి దేవాలయాల సంస్కృతి అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించడం అందరి కర్తవ్యమన్నారు. రామ మందిర నిర్మాణం ప్రతి హిందువుకు ఆకాంక్ష అని అలాంటి ఆకాంక్ష మోదీ నేరవేర్చారన్నారు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఇలాంటి సదస్సు ఉపయోగకర మన్నారు గోవా సీఎం ప్రమోద్ సావంత్.