మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? మీ వినికిడికి హాని కలిగించే 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి..!

మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? మీ వినికిడికి హాని కలిగించే 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి..!

ఇయర్‌ఫోన్స్ చాలా మందికి అవసరమైన వస్తువుగా మారిపోయాయి. వీటితో పాటలు వినడం, సినిమాలు చూడటం, ఫోన్‌లో మాట్లాడటం చేస్తుంటారు. రకరకాల ఫీచర్లతో ఇవి లభిస్తాయి. అన్ని వయసుల వారు వీటిని వినోదం కోసం, కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇయర్‌ఫోన్స్ కూడా ఉంటాయి.

ఇయర్‌ఫోన్స్ అధికంగా వినడం వినికిడికి తీవ్రమైన హానిని కలిగించవచ్చట. వైద్య నిపుణుల ప్రకారం.. ఎక్కువ శబ్దంతో ఇయర్‌ఫోన్స్ వినడం, శబ్ద కాలుష్యం, బహుళ కాలంలో వినికిడి నష్టానికి దారితీస్తుందట. అదనంగా ఇయర్‌ఫోన్ ఉపయోగం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్లు, తలనొప్పి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. మరీన్ని హాని కలిగించే సమస్యల గురించి తెలుసుకుందాం.

హై వాల్యూమ్ తో సమస్యలు

ఎక్కువసేపు ఎక్కువ వాల్యూమ్‌లో వినడం వల్ల చెవిలోని సున్నితమైన కణాలకు హాని కలుగుతుంది. ఈ కణాలు ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి. బిగ్గరగా ఉండే ధ్వని వినికిడిని తగ్గిస్తుంది. చెవి కాలువలో అమరే ఇయర్‌ఫోన్‌లు మరింత ప్రమాదకరమైనవి. ఎందుకంటే అవి చెవి డ్రమ్కు చేరే ధ్వనిని పెంచుతాయి. ఇది చివరికి వినికిడిని తగ్గిస్తుంది.

నాయిస్-కాన్సిలింగ్

నాయిస్-కాన్సిలింగ్ ఇయర్‌ఫోన్‌లు చుట్టూ ఉన్న శబ్దాన్ని తగ్గించి మంచి అనుభూతిని అందిస్తాయి. కానీ వీటిని ఎక్కువగా ఉపయోగించడం ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటలు వినేటప్పుడు వాల్యూమ్ ఎక్కువ పెడతారు. దీనివల్ల వినికిడి దెబ్బతింటుంది. అంతేకాదు చుట్టూ ఉన్న సాధారణ శబ్దాలు కూడా వినిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

పరిశుభ్రత సమస్యలు

ఇయర్‌ఫోన్‌లను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చెవి కాలువలో తేమ, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. దీని వల్ల చెవి ఇన్ఫెక్షన్లు వస్తాయి. తాత్కాలికంగా వినికిడి తగ్గిపోతుంది. కొన్నిసార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్, నొప్పి కూడా వస్తాయి. ఇయర్‌ఫోన్‌లను ఇతరులతో పంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి.

చెవిలో గులిమి

సాధారణంగా గులిమి చెవి కాలువను శుభ్రపరుస్తుంది. కానీ ఇయర్‌ఫోన్‌లను నిరంతరం ఉపయోగించడం వల్ల గులిమి చెవి కాలువలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ధ్వని మఫుల్ అవుతుంది. ఎక్కువ గులిమి ఉత్పత్తి చేసే వ్యక్తులు ఇయర్‌ఫోన్‌లు ఎక్కువగా ఉపయోగిస్తే ఈ పరిస్థితికి గురయ్యే అవకాశం ఉంది.

చెవిలో రింగింగ్

కొన్ని సందర్భాలలో ఎక్కువ వాల్యూమ్‌లో ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల టిన్నిటస్ లేదా చెవిలో రింగింగ్ శబ్దాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది శాశ్వత వినికిడి నష్టానికి దారితీస్తుంది. ఇయర్‌ఫోన్‌లు వినోదానికి, కమ్యూనికేషన్‌కు ఉపయోగపడతాయి. కానీ వాటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వినికిడికి హాని కలుగుతుంది. పైన పేర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇయర్‌ఫోన్‌ల వినియోగాన్ని పరిమితం చేయడం ఆరోగ్యానికి మంచిది.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు