జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన చేసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అంతే కాకుండా ప్రతి సినిమాలో సరికొత్తగా కనిపిస్తూ.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు ఈ హీరో. అయితే చిత్ర పరిశ్రమలో ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాను మరొకరు చేయడం చాలా కామన్. అయితే అలానే రెబల్ స్టార్ ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలతో తారక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడంట. ఇంతకీ ఆ సినిమాలు ఏవి అంటే?
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి సినిమాతో ఈయన వరల్డ్ వైడ్ మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అయితే ఈ హీరో చాలా సినిమాలను తిరస్కరించారంట. అవి:
జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లలో అశోక్ ఒకటి. అయితే ఈ సినిమాను ప్రభాస్ తిరస్కరించడంతో, ఎన్టీఆర్‌కు అవకాశం వచ్చి ఆయన చేశారంట.2 / 5అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమన్నా హీరోయిన్‌గా నటించిన మూవీ ఊసర వెల్లి. ఈ స్టోరీని కూడా దర్శకుడు మొదట ప్రభాస్‌కు వినిపించాడంట. ఆయన రిజెక్ట్ చేయడంతో ఆఫర్ తారక్‌కు వచ్చింది.3 / 5అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, కాజల్ జంటగా నటించిన సినిమాల్లో బృందావనం ఒకటి. ఈ సినిమా యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కాగా, ఈ మూవీ కథ కూడా మొదటగా ప్రభాస్ వద్దకే వెళ్లిందంట.4 / 5జూనియర్ ఎన్టీర్ సినీ కెరీర్ ఓ మలుపు తింపిన చిత్రాల్లో సింహాద్రి మూవీ ఒకటి. ఈ సినిమాతో తారక్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అయితే ఈ సినిమా కథ కూడా మొదట ప్రభాస్ వద్దకు వెళ్లగా ఆయన రిజెక్ట్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.