తెలుగు చిత్రపరిశ్రమలో నందమూరి హీరో బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబో గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. బాలయ్య సినిమాలకు తమన్ అందించే మ్యూజిక్ కు థియేటర్లు దద్ధరిల్లాల్సిందే. తాజాగా తమన్ కు ప్రేమతో ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు బాలయ్య.
ఇటీవలే డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబో ఇప్పుడు బాక్సాఫీస్ ను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాయి. బాలయ్య సినిమాకు తమన్ మ్యూజిక్ అంటే విడుదలకు ముందే సెన్సేషన్. సినిమాల కంటే ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఇటీవల డాకు మహారాజ్ మూవీ ఈవెంట్లలో సైతం తమన్ పై ప్రశంసలు కురిపించారు బాలయ్య. తాజాగా తమన్ కు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. తమన్ పై ఉన్న అభిమానంతో అతడికి కాస్ట్ లీ కారును బహుమతిగా అందించారు.
ఆ కారు ధర రూ.1 కోటికి పైగానే ఉంటుందని సమాచారం. న్యూ బ్రాండెండ్ పోర్చ్సే కారును బాలయ్య స్వయంగా కొని.. రిజిస్ట్రేషన్ చేయించి మరీ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, కొత్త కారుతో బాలయ్య, తమన్ దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తమన్, బాలయ్య కాంబోలో ఇప్పటికే వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
డాకు మహారాజ్ సినిమా తర్వాత బాలయ్య నటిస్తోన్న అఖండ 2 సినిమాకు సైతం తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఎప్పటిలాగే అఖండ 2 కోసం తమన్ మరోసారి సౌండ్ బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.