ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..

 ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..

అసలే కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దేశంతట వణికిపోతుంటే.. అవి చాలవన్నట్టు ఇప్పుడు మరిన్ని కొత్త వైరస్‌లు దేశాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులను మరింత తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ కోవలోనే ఇపుడు ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ (జి బి ఎస్)అనే ఓ వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన వాతాడ యువంత్‌ అనే పదేళ్ల బాలుడు ఈ వ్యాధితోనే మృతి చెందాడని ప్రచారం జరుగుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కాపుగోదాయవలస కి చెందిన రోజా, చిరంజీవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ఏడవ తరగతి చదువుతున్నాడు. చిన్నకుమారుడు యువంత్ స్వగ్రామంలోనీ ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. కిందటి నెల 29న తొమ్మిదవ యేట పూర్తిచేసి 10వ ఏటలో అడుగుపెడుతూ బర్త్ డే జరుపుకున్న యువంత్ కు.. 12వ రోజు డెత్ డే అయిపోయింది. తన బర్త్ డే అయిన మరుసటి రోజు గొంతు నొప్పిగా ఉందని చెప్పడంతో యువంత్ తల్లి దండ్రులు ఆయన్నీ స్థానిక వైద్యునికి చూపించారు. కానీ గొంతు నొప్పి తగ్గలేదు. ఆ తర్వాత శ్రీకాకుళం నగరంలోని వివిధ ఆసుపత్రులకు తిప్పారు. ఈ ఎన్ టి డాక్టర్ల కు కూడా చూపించారు. కానీ ఫలితo లేకపోయింది. ఒక్కసారిగా బాడి లోని అవయవాలు చొచ్చుబడిపోయాయి.క్రమేపీ యువంత్ కదలలేని పరిస్థితికి వచ్చేయటoతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం విశాఖలోని ఓ ప్రయివేటు కార్పొరేట్ హాస్పిటల్లో చేచ్చారు. అక్కడ వైద్యులు యువంత్ కి పలు వైద్య పరీక్షలు చేశారు. అందులో నెర్వ్ కండక్ట్స్ స్టడీ పరీక్షలో యువంత్ కి గులియన్-బారే సిండ్రోమ్ (GBS)అనే వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు.

పుట్టెడు దుఖంలోనూ.. అవయవదానం..

విశాఖలోని కార్పొరేట్ హాస్పిటల్ వైద్యులు తమ వంతు కృషి చేసినప్పటికీ యువంత్ శరీరం లోని అవయవాలు వైద్యoకి సహకరించలేదు. చివరకు మెడదు పనిచేయడం లేదని వైద్యులు చెప్పడంతో చేసేది లేక బాలుడిని శ్రీకాకుళంలోని జెమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. జెమ్స్ వైద్యులు యువంత్ కి బ్రెయిన్ డెడ్ అయిందని తేల్చిచెప్పారు. యువంత్ బతికే అవకాశాలు లేకపోవడంతో అవయవదానం చేసేందుకు వైద్యుల సూచన మేరకు యువంత్ తల్లి దండ్రులు ముందుకు రాగా.. ఈనెల 10న కిడ్ని, లివర్, గుండె, కళ్ళను ఆయా అవయవాలు అవసరమైన వారికీ దానం చేశారు.

విశాఖలోని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లో జరిపిన నెర్వ్ కండక్ట్స్ స్టడీ ప్రకారం బాలుడికి GBS వైరస్ సోకిందని నిర్ధారణకు వచ్చి చికిత్స అందించారు.అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాల మురళీకృష్ణ మాత్రం బాలుడికి GBS వైరస్ సోకిందని నిర్దారణ చేయలేమని అంటున్నారు. నెర్వ్ కండక్ట్స్ స్టడీతో పాటు CSF ఎగ్జామి నేషన్ లో కూడా తెలాకే వందశాతం నిర్దారించగలమని అంటున్నారు. అయితే జిల్లా వైద్య అధికారులకు సమాచారం తెలిసినప్పటికే బాలుడు అవయవదానం పూర్తి చేసి అంత్యక్రియలు కూడా పూర్తి చేసేసారు. అయితే అరుదైన వ్యాధి లక్షణాలు కావడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బాలుడు మృతి చెందిన రెండు రోజుల తర్వాత అధికారులు గ్రామానికి వెళ్ళి కుటుంబ సభ్యులును కలిసి బాలుడు మృతిపై విచారణ చేపట్టారు.

ఓవైపు బాలుడికి జి.బి.ఎస్ వైరస్ సోకిందని నిర్ధారణ కాలేదు..అంటూనే మరోవైపు గ్రామంలో బుధవారం నుండి వరుసగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి గ్రామస్తులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం,గురువారం జరిగిన మెడికల్ క్యాంపులలో అనుమానం ఉన్న 68 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. GBS వైరస్ అంటువ్యాధి కాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య అధికారులు చెబుతున్నారు. లక్ష ,రెండు లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి వస్తుందని అంటున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి మొత్తం నాడి వ్యవస్థ దెబ్బతిని అన్ని అవయవాలు చచ్చుబడిపోతాయి. మహారాష్ట్రలో 114 మంది వరకు GBS వ్యాధిబారిన పడినవారు ఉండగా అందులో ఆరుగురు చిన్నారులు మరణించినట్లు చెబుతున్నారు. ఇటీవల తెలంగాణలో కూడా ఆ వ్యాధి లక్షణాలు బయటపడినట్లు తెలుస్తోంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు