గుడ్డులోని పచ్చసొనను పక్కన పెట్టేస్తున్నారా?..అయితే మీరు చాలా నష్టపోతున్నట్లే

గుడ్డులోని పచ్చసొనను పక్కన పెట్టేస్తున్నారా?..అయితే మీరు చాలా నష్టపోతున్నట్లే

పోషకాల పవర్ హౌస్… కోడిగుడ్డు అంటారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే చాలు… మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ఇది ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D, ఇనుము, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.పోషకాల పవర్ హౌస్… కోడిగుడ్డు అంటారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే చాలు… మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ఇది ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D, ఇనుము, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాంటి గుడ్డులోని పచ్చ సొనను కొందరు బయట పడేస్తుంటారు. కేవలం తెల్లసొన మాత్రమే తింటుంటారు. నిజానికి మనం తినాల్సింది పచ్చ సొననే అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

గుడ్డులోని పచ్చ సొన పోషకాల గని. అయితే చాలా మంది కొలెస్ట్రాల్ భయంతో పచ్చ సొనను తినడానికి వెనుకాడుతుంటారు, కానీ నిజానికి పచ్చ సొనలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చసొన తినడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే వదిలి పెట్టకుండా తింటారు. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెటినోల్ రూపంలో దొరుకుతుంది. మన కళ్ళలోని రెటీనాకు ఇది చాలా అవసరం. రేచీకటి రాకుండా అడ్డుకుంటుంది. వయసు పెరుగుతుంటే వచ్చే అంధత్వం రాకుండా రక్షిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడం చాలా అవసరం. లేకుంటే అధిక రక్తస్రావమై ప్రాణాపాయం కలుగుతుంది. ఇలా గాయాల నుంచి రక్తాన్ని ఆపే శక్తి విటమిన్ Kకు ఉంది. ఇది గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. అలాగే, గుడిలోని పచ్చసొనలోనే విటమిన్ డి మూలాలు ఉంటాయి. ఇది ఆస్టియోపొరాసిస్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఈ కూడా మెరుగ్గా ఉంటుంది. దీన్ని తినడం వల్ల చర్మానికి ఎలాంటి నష్టాలు రావు. చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మంపై ముడతలు పడడం, మొటిమలు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి. మన శరీరానికి అత్యవసరమైన బి విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.బి విటమిన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు