సైఫ్ కుటుంబీకుల సంచలన నిర్ణయం! చేదు అనుభవాలను మర్చిపోయేందుకు..

సైఫ్ కుటుంబీకుల సంచలన నిర్ణయం! చేదు అనుభవాలను మర్చిపోయేందుకు..

సైఫ్ అలీఖాన్ గత గురువారం (జనవరి 15) దుండిగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. లీలావతి ఆస్పత్రిలో చేరిన అతనికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో మంగళవారం (జనవరి 21) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడీ బాలీవుడ్ నటుడు.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గత కొన్నేళ్లుగా బాంద్రాలోని ‘సద్గురు శరణ్’ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. అయితే ఇటీవల ఓ దుండగుడు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు. విచక్షణా రహితంగా నటుడిపై దాడి చేశాడు. దీంతో నటుడి ఇంటి భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే ప్రస్తుత నివేదికల ప్రకారం సైఫ్ కుటుంబీకులు త్వరలోనే ఈ ఇంటిని వీడనున్నట్లు తెలుస్తోంది. వారు వేరే చోటికి మారే అవకాశం ఉంది. సైఫ్ మంగళవారం (జనవరి 21) మధ్యాహ్నం ఆయన ఆసుపత్రి నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ.. బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతన కొన్ని నెలల పాటు సినిమా షూటింగుల నుంచి దూరంగా ఉండవచ్చు. అయితే ఇప్పుడు సైఫ్ అలీఖాన్ తన నివాసాన్ని ‘ఫార్చ్యూన్ హైట్స్’ బిల్డింగ్‌కి మారే అవకాశం ఉందని అంటున్నారు. బాంద్రాలోని ఫార్చ్యూన్ హైట్స్‌లో సైఫ్‌కు లగ్జరీ ఫ్లాట్ ఉంది. ఆయన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. ఇందులో అతనికి సొంత ఇల్లు కూడా ఉంది. దీంతో సైఫ్ కొన్ని రోజుల పాటు ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. దీనికి తోడు ఇప్పుడున్న భవనంలో ఉండడం వల్ల చెడు జ్ఞాపకాలు వస్తాయని కూడా చెబుతున్నారు. సైఫ్-కరీనా ఇంట్లోని కొన్ని వస్తువులను ఈ ఇంటికి మార్చేందుకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది.

కాగా సైఫ్ అలీఖాన్‌కు రెండు మేజర్ సర్జరీలు జరిగాయి. వీపుపై ఉన్న కత్తి మొనను బయటకు తీశారు. అలాగే మెడ గాయానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్లు సమాచారం. ఇక దాడి ఘటన అనంతరం నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతను బంగ్లాదేశ్ కు చెందినవాడని కూడా అనుమానిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చిన మహ్మద్ షెరీఫుల్ ఇస్లాం షెహజాద్ కొన్ని నెలలుగా ముంబైలో నివసిస్తున్నాడు. తన పేరు కూడా మార్చుకున్నాడు. విజయ్ దాస్ పేరుతో తన నిజస్వరూపాన్ని దాచుకున్నాడు. ఇలా విచారణలో ఎన్నో షాకింగ్ నిజాలు బయటికి వస్తున్నాయి.

Please follow and like us:
వార్తలు సినిమా