ప్రతి వారం అటు థియేటర్లలోకి, ఇటు ఓటీటీల్లోకి సరికొత్త చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సినిమాల హావా కొనసాగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు ఇప్పుడు థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ వారం సైతం థియేటర్లలోకి మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి.
గత వారం సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాలన్ని మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ థియేటర్లలలో విజయవంతంగా దూసుకుపోతున్నాయి.ఈ చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి విడుదలైన సినిమాల సందడి కొనసాగుతుంది. మరోవైపు ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని చిత్రాలు వస్తున్నాయి. ఓటీటీ వేదికగా మరింత వినోదం అందించేందుకు కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.
గాంధీ తాత చెట్టు..
డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన మొదటి సినిమా గాంధీ తాత చెట్టు. డైరెక్టర్ పద్మావతి మల్లాది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే భారీగా అవార్డులు వచ్చాయి. దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో ఉత్తమ పరిచయ నటిగా సుకృతి , దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలాంటి పలు పురస్కారాలు సొంతం చేసుకుంది. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది.
ఐడెంటిటీ..
హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ఐడెంటిటీ. ఇందులో టొవినో థామస్ హీరోగా కనిపించాడు. ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల చేయనున్నారు మేకర్స్. అఖిల్ పాల్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదలకానుంది.
స్కైఫోర్స్..
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో సందీప్ కేవ్లానీ తెరకెక్కించిన సినిమా స్క్రైఫోర్స్. ఆయన ఇందులో వింగ్ కమాండర్ గా కనిపించనున్నారు. సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ కీలకపాత్రలు పోషించారు. ఈనెల 24న ఈ సినిమా రిలీజ్ కానుంది.
డియర్ కృష్ణ..
ప్రేమలు హీరోయిన్ మమితా బైజు, అక్షయ్, ఐశ్వర్య ప్రధాన పాత్రలలో నటించిన సినిమా డియర్ కృష్ణ. దినేశ్ బాబు తెరకెక్కించిన ఈ సినిమాను జనవరి 24న విడుదల చేయనున్నారు. శ్రీకృష్ణుడికి ఆయన భక్తుడికి మధ్య చోటు చేసుకునే సంఘటనల సమాహారమే ఈ సినిమా.
హత్య..
ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా హత్య. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీని ఈనెల 24న రిలీజ్ చేయనున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు..
అమెజాన్ ప్రైమ్ వీడియో..
విడుదల 2.. స్ట్రీమింగ్ అవుతుంది.
ఈటీవీ విన్..
వైఫ్ ఆఫ్.. జనవరి 23
ఆహా..
రజాకార్.. జనవరి 24
నెట్ ఫ్లిక్స్..
ది నైట్ ఏజెంట్ సీజన్ 2.. జనవరి23 ది సాండ్ క్యాసిల్.. జనవరి 24
జీ5..
హిసాబ్ బరాబర్.. జనవరి 24