ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్‌ పరీక్ష.. భారీగా పెరిగిన పాస్‌ పర్సెంటైల్‌!

ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్‌ పరీక్ష.. భారీగా పెరిగిన పాస్‌ పర్సెంటైల్‌!

రాష్ట్రంలో జూన్‌ 18 నుంచి 30 మధ్య ఆన్‌లైన్‌ టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 22న విడుదలైనాయి. తాజా ఫలితాల్లో మొత్తం 1,37,429 మంది పరీక్ష రాయాగా.. రెండు పేపర్లకు కలిపి 59,692 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 43.43 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నమాట. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో..

తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ 18 నుంచి 30 మధ్య ఆన్‌లైన్‌ టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 22న విడుదలైనాయి. తాజా ఫలితాల్లో మొత్తం 1,37,429 మంది పరీక్ష రాయాగా.. రెండు పేపర్లకు కలిపి 59,692 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 43.43 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నమాట. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా కొనసాగుతున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీలు)లో ఈసారి టెట్‌ పరీక్షలో దాదాపు సగం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎస్‌జీటీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలంటే టెట్‌ పాస్‌ కావాల్సిందేనని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఆదేశాలు జారీ చేసింది.

వీరంతా పేపర్‌ 2 పరీక్ష రాసి అందులో పాసవ్వాలి. అయితే దాన్ని రాష్ట్రంలో చాలాకాలంగా అమలు చేయడం లేదు. దీనిపై కొందరు గత ఏడాది హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. ఈక్రమంలో పలువురు ఎస్‌జీటీలు ఈ సారి టెట్‌ పేపర్‌ 2 పరీక్ష రాశారు. టెట్‌ పేపర్‌ 2 గణితం- సైన్స్‌ విభాగంలో 3,018 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,950 మంది పరీక్ష రాయగా.. వారిలో 988 మంది అంటే 50.67 శాతం మంది పాసయ్యారు. పేపర్‌ 2 సోషల్‌ స్టడీస్‌ విభాగంలో 1,591 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 1,072 మంది పరీక్ష రాశారు. వీరిలో 511 మంది అంటే 47.67 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఇప్పటికే ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారు కొలువులో కొనసాగాలంటే టెట్‌ పాస్‌ కావాలని కేంద్ర విద్యాశాఖ 2011లో ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు 2012 నుంచి తెలంగాణ రాష్ట్రంలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ సారి టెట్‌లో పేపర్‌ 1లో 61 శాతం, పేపర్‌ 2లో 33.98 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. 2024తో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం కూడా తగ్గింది. 2024లో పేపర్‌ 1లో 67.13 శాతం, పేపర్‌ 2లో 34.18 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. టెట్‌లో ఒకసారి పాసైతే జీవిత కాలం గుర్తింపు ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Please follow and like us:
తెలంగాణ వార్తలు